Breaking News

‘‘జగనన్నకు చెబుదాం’’ 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే వ్యక్తిగత స్థాయి సమస్యలను మెరుగైన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘జగనన్నకు చెబుదాం’’ 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు విసృత ప్రచారం కల్పించి సమస్యల పరిష్కారంలో ప్రసార మాధ్యామాల సహాకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘జగనన్నకు చెబుదాం’’ 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కార్యక్రమంపై బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మీడియాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ పారదర్శకమైన సేవలను అందిస్తుందన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను మరింత సంతృప్తి స్థాయిలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘‘జగనన్నకు చెబుదాం’’ 1902 టోల్‌ ఫ్రీ ద్వారా నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించారన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన వ్యక్తిగత ఇబ్బందులను 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా జగనన్నకు చెబుదాం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే అవకాశం కల్పించారన్నారు. స్పందనలో నమోదు అవుతున్న ఆర్జీలను నిర్థేశించిన గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. వివిధ కారణాలతో స్పందనకు హాజరు కాలేనివారు, సుదీర ప్రాంతాల వారు జగనన్నకు చెబుదాం 1902 టోల్‌ ఫ్రీ ద్వారా తమ సమస్యలను నివేధించుకుని పరిష్కరించుకోవచ్చునన్నారు. వీలైనంత వరకు ఆర్జీదారులు నేరుగా సమీపంలోని స్పందన కార్యక్రమానికి హాజరై సమస్యను వివరించిన్నట్లైయితే మరింత సులువుగా పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. పరిష్కారమైన ఆర్జీలపై సంబంధిత ఆర్జీదారులతో 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటారన్నారు. జిల్లాలో రీఓపెన్‌ అవుతున్న ఆర్జీలపై ప్రతి శనివారం ఆయా అర్జీదారుడు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో టెలి, వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించి పరిష్కరిస్తున్నామన్నారు. వివిధ మార్గాల ద్వారా స్పందనలో నమోదు అవుతున్న ఆర్జీలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కారం చూపే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎక్కువగా నమోదు అవుతున్న రెవెన్యూ పరమైన ఆర్జీలలో 22ఏ, ఆర్‌వోఆర్‌ ఆర్జీల విషయంలో ఆలస్యం కూకుండా పరిష్కరిస్తున్నామన్నారు. పదేపదే రిఒపెన్‌ అవుతున్న ఆర్జీలకు సంబంధించి సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా డివిజన్‌ స్థాయిలో జరిగే కార్యక్రమానికి తాను కూడా హాజరై సమస్యలను తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన జగనన్నకు చెబుదాం 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ను మీడియా ద్వారా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *