Breaking News

రెడ్‌క్రాస్‌ సేవలలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగుల తోడ్పాటు అభినందనీయం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి అందిస్తున్న సేవలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, ఉద్యోగుల తోడ్పాటు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్‌ డిల్లీరావు ఇచ్చిన పిలుపునకు స్పందించి పలు జిల్లా అధికారులు, సిబ్బంది ముందుకు రావడం జరిగింది దీనిలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది 1 లక్ష 531 రూపాయల ఆర్థిక సహాయపు చెక్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డిల్లీరావుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలు, విపత్తులు సంభవించిన తరుణంలో బాధితులకు సేవలందిస్తున్నారన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను బలోపేతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం తరుపున ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులు వారికి తోచిన విధంగా రెడ్‌క్రాస్‌ సొసైటికి ఆర్ధిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి సేవలకు తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది 1 లక్ష 531 రూపాయలను తమ వంతుగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటికి సభ్యత్వ రూపంలో అందించడం పట్ల జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అభినందించారు.
జిల్లా కలెక్టర్‌ కు ఆర్థిక సహాయ చెక్‌ను అందించిన వారిలో డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, డిపియం యం. సునీత, కమ్యూనిటి కో`ఆర్డినేటర్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *