Breaking News

యలమంచిలి కాంప్లెక్స్ దగ్గర నేషనల్ హైవే సర్వీస్ రోడ్డులో డ్రైన్

-నిర్మల్ హ్యాపీ భవన్ మరియు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలన
-కమీషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి జాతీయ రహదారి ప్రక్కన గల యలమంచిలి కాంప్లెక్స్ దగ్గర నేషనల్ హైవే సర్వీస్ రోడ్డులో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం నుండి చెత్తాచెదారంతో మూసుకుపోయిన సర్వీస్ రోడ్డును పరిశీలించి కోర్టు నిబంధనల ప్రకారం డ్రైన్‌లను నిర్మాణం చేయాలనీ ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ అథారిటీని వారితో సంప్రదించి NHAI ద్వారా కొత్త డ్రెయిన్ నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్డు వేయనట్లుగా చూడలని అన్నారు.

తదుపరి బందరు రోడ్డులోని రాఘవయ్య పార్కు దగ్గర నిర్మాణం చేపడుతున్న నిర్మల్ హ్యాపీ భవన్ ను ఈ నెలాఖరులో రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహనరెడ్డి చే ప్రారంభోత్సవము కార్యాక్రమము ఏర్పాట్ల పరిశీలనలో నిర్మల్ హ్యాపీ భవన్ లోని సివిల్స్ వర్క్స్ ను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించడమైనది. అదేవిధంగా అందులో గ్రీనరీ మొక్కలను మరియు మొక్కల కుండిలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపు పై ఏ.డి.హెచ్. మరింత దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా సిఎం గారి రూట్ ను పరిశీలించి ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా చూడాలని అధికారులకు ఆదేశించడమైనది.

తదుపరి స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్,కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించిన కమిషనర్ అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయాలని ఆదేశించారు.

అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహం తో పాటు మిగిలిన పనులు సైతం సమయంలోపు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్లు కు ఆదేశించారు.

ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)  కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, (డిప్యూటీ సిటి ప్లానర్ ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కరిముల్లా, ఎస్.ఇ నరసింహ మూర్తి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *