Breaking News

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం అదృష్టం గా భావిస్తున్నాను

-శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో గంగమ్మ జాతర ఉత్సవాలు
-స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రోద్భలంతో గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం గర్వకారణం
-రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం అదృష్టం గా భావిస్తున్నాని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తిరుపతి గంగ జాతర సందర్భంగా రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి గంగమ్మకు సారె సమర్పించాదానికి ఆలయం చేరుకున్న మంత్రికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి,మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గంగమ్మ తల్లికి సారె సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం నందు మంత్రి మీడియా తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం అదృష్టం గా భావిస్తున్నాని తెలిపారు. గత సంవత్సరం గంగ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, ఈ సంవత్సరం కనివిని ఏరుగని రీతిలో గంగమ్మ జాతర జరుగుతుందని తెలిపారు. తిరుపతి ప్రజలనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందన్నారు. గత ఏడాది కంటే ఈసారి ఇంకా అద్భుతంగా జాతర జరుగుతోందని వివరించారు.తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ఇక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి వారి చెల్లి గంగమ్మ తల్లికి జాతర నిర్వహిస్తుండడం సంతోషకరమని తెలిపారు.మరుగున పడుతున్న మన హైందవ సంస్కృతి, భక్తి మరుగున పడిపోతున్న దశలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున గంగమ్మ తల్లి జాతర చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా గర్వకారణమని, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రోద్బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా గర్వకారణంని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కి సంప్రదాయల పట్ల, హైందవ మతం పట్ల ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీ యాదవ్, ఈవో మునికృష్ణ ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *