Breaking News

గంగమ్మ తల్లిని దర్శించుకున్నజాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ గంగమ్మ తల్లికి సారె సమర్పించెందకు
గంగమ్మ ఆలయం చేరుకున్న జేసి కి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్ ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభ తో స్వాగతం పలికారు.జేసి అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారుని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు జేసికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మునికృష్ణయ్య, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *