Breaking News

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర

-పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు
-విశేష ప్రజాధరణతో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ ముందుకు సాగినట్లు ఎంఎస్ బేగ్, పెందుర్తి శ్రీనివాస్ తెలిపారు. యువగళం పాదయత్ర 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్ నాని ఆదేశాలు. మేరకు ఎంఎస్ బేగ్ &టీం టీ డీ. పీ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. మొదట పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్, విగ్రహాలకు నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు. నారా లోకేష్‌కు మద్దతుగా చేపట్టిన పాదయాత్ర . జెండా చిట్ సెంటర్ రాయల్ హోటల్ పంజాబ్ సెంటర్ ఖాదర్ సెంటర్, గొల్లపాలెం గట్టు, ఆర్ సి ఎం స్కూల్, బంగారయ్య కొట్టు, నెహ్రూ బొమ్మ సెంటర్, కోమల విలాస్, రామయ్య కూల్ డ్రింక్ షాప్, సోమరన్ చౌక్, భవన్ నారాయణ వీధి, కాలేశ్వరం మార్కెట్, ఎం.కే బేగ్ గోల్డ్ మార్కెట్, జండా చటర్ వద్ద ఉన్న పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో యువగళం జెండాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. సంఘీభావ పాదయాత్రలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు. మండుటెండలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1269 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. వారందరికీ తాను ఉన్నానన్న భరోసా కల్పిస్తూ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ కు నాయకులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు నల్లపాటి రాము, మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ రాష్ట్ర కార్యదర్శి ఎందుకు శ్రీనివాస్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ ముందుకు సాగినట్లు తెలిపారు. మండే ఎండలను, భారీ వర్షాలను లెక్క చేయకుండా ప్రజల కోసం లోకేశ్ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా లెక్కచేయకుండా కష్టాల్లో ఉన్న ప్రజల చెంతకు చేరేందుకు లోకేష్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదన్నారు. లోకేష్ యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమవుతున్నట్లు తెలిపారు. రోజురోజుకు యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందన అధికారపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. యువగళం పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనను చూస్తుంటే ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో అర్ధమంవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని, యువగళం యాత్ర దిగ్విజయంగా జరగాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో నారా లోకేష్ ను భారీ మేజార్టీతో గెలిపించడానికి అందరు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా అనుబంధ సంఘా ల నాయకులు, నియోజకవర్గం అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు,డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శలు క్లస్టర్ ఇన్చార్జిలు కార్యకర్తలు, మహిళలు, పార్టీ అభిమానులు, ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *