విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి సందర్శించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వీరికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. హనుమత్ వైభవ ప్రవచనానంతరం దాసాంజనేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని చాగంటి వారు అన్నారు. ఆలయానికి దశాబ్ధాల ఘన చరిత్ర ఉందని.. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయాన్ని సందర్శించడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కనపర్తి కొండలరావు, ఈవో నాగినేని భవానీ, కమిటీ సభ్యులు గోపవరపు నాగేశ్వరరెడ్డి, నాగజ్యోతి, యక్కల మారుతి, ప్రభల శ్రీనివాస్, కోలుకొండ శ్రీనివాస్, యర్రంశెట్టి శ్రీను, చిన్నం మధుబాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News