Breaking News

రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వీరుల్లపాడు మండలం జయంతి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. రీసర్వేలో జరుగుతన్న గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పనులను పరిశీలించి సర్వే అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని నిర్థేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్వేయర్లకు ప్రాధమిక చికిత్సకు అవసరమైన ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అందజేశారు. పనుల పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ వెంట సర్వే లాండ్‌ రికార్డ్సు సహాయ సంచాలకులు కె. సూర్యారావు, వీరుల్లపాడు తహాశీల్థార్‌ ఆసయ్య నాయక్‌, విఆర్‌వోలు, గ్రామ సర్వేయర్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *