-సీయం జగన్మోహన్ రెడ్డి విద్యా అభివృద్ది అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నారు.
-విద్యాభివృద్దితోనే పేదరికం నిర్మూలన సాధ్యం..
-నాడు- నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకీకరణ, మౌలిక వసతులు కల్పన..
-హోం మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24 వ తేదీ కొవ్వూరు పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి “జగనన్న విద్యా దీవెన” కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. తొలిసారి కొవ్వూరు నియోజక వర్గంలో సిఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నామని పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ముందస్తు ఏర్పాట్లుపై మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మ హన్ రెడ్డి విద్యా అభివృద్ది అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యశించడం వలన పేదరికం నిర్మూలించవచ్చుననే సంకల్పంతో ఫీజురింబర్సు మెంట్ ప్రవేశపెట్టారన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేదరికం చదువుకు అడ్డు కాకూడదనే లక్ష్యంతో అర్హులైన పేద విద్యార్థులందరికీ విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రింబర్సు మెంట్ సకాలంలో అందిస్తూ ఉన్నత చదువు చదివిస్తున్నారన్నారు. ఫీజు రింబర్సు మెంట్ కు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1700 కోట్లు మన ప్రభుత్వమే చెల్లించిందని పేర్కొన్నారు. విద్య వలనే అత్యంత వేగంగా సమాజాభివృద్ది జరుగుతుందనే నమ్మకం సీయం జగన్మోహన్ రెడ్డి గుర్తించి అర్హులైన అందరికీ ఉన్నత చదువులు అభ్యశించేందుకు ఫీజురింజర్సు మెంట్ అందిస్తున్నారన్నారు.
బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించే దిశగా బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షల కుటుంబాల్లోని పిల్లలకు విద్యా దీవెన అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేసి వారిలో ఆత్మవిశ్వాసం పెంచి, పేదరికం దూరం చెయ్యాలనే ఆశయంతో విద్యా వ్యవస్థకు అత్యంత పటిష్టత చేకూర్చారన్నారు. నాడు నేడు ద్వారా విద్య వ్యవస్థ కోసం పెద్దపీట వేస్తూ పాఠశాలలు, కళాశాలలు ఆధునీకీకరణ, మౌలిక వసతులు కల్పించడం పాటు మరో వైపు అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్య వంటి అనేక పథకాలను అందిస్తూ విద్యకు తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆ దిశలో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో విద్యాభివృద్దికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రభుత్వం వెనకడుకు వేయకుండా బడుగు బలహీన వర్గాల అండగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి అర్హులైన ప్రతి ఒక్కరినీ జగనన్న ఆదుకున్నారని పేర్కొన్నారు. విద్యా శాఖలో వినూత్నమైన మార్పులు తెస్తున్న సీయంను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా అభివృద్ధి కోసం చేస్తున్న ప్రణాళికలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుడడం మనందరికీ గర్వకారణం అని మంత్రి తానేటి వనిత తెలిపారు. ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుని, త్వరలో 5 ఏటా అడుగు పెడుతున్న సందర్భంలో సిఎం కొవ్వూరు నియోజకవర్గం లో పర్యటన కు రానున్నడంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News