Breaking News

జగనన్న విద్యా దీవెన కింద జిల్లాకు రూ.30 కోట్లు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభా వేదిక వద్ద పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సత్యవతి నగర్ లోని సభా వేదిక వద్ద హోం మంత్రి తానేటి వనిత , ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎంపి మార్గని భరత్ రామ్, కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ , కొవ్వూరు పురపాలక సంఘం చైర్ పర్సన్ బావన రత్న కుమారి తదితరులతో కలిసి సభా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను కలెక్టర్ కె. మాధవీలత తెలియ చేస్తూ, జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద రూ.30 కోట్ల రూపాయల తల్లుల ఖాతాకు జమ చేయడం జరిగిందన్నారు. మొత్తం 30 గ్యాలరీలు ఏర్పాటు చేశామని, 22 వేల మంది అనుగుణంగా కుర్చీలు ఏర్పాట్లు చేశామన్నారు. వేసవి దృష్ట్యా మంచి నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు , అల్పాహరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లులు హాజరుకానున్న దృష్ట్యా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే విద్యార్థుల కోసం ఆయా కళాశాలల్లో, వివిధ గ్రామాల నుంచి వచ్చే వారి కోసం గ్రామాల్లో బస్సులు ఏర్పాటు చేశామన్నారు. బస్సుల్లో త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచు తున్నట్లు మాధవీలత తెలిపారు.
ఇంటర్మీడియట్ తరువాత పాలిటెక్నిక్, డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్, అగ్రి కల్చర్, సాధారణ డిగ్రీ చదివే విద్యార్థులకు “జగనన్న విద్యా దీవెన” కింద ఆర్థిక భరోసా ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *