విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ మోహన్ రెడ్డి అరాచకపాలన మీద నిరసనగా తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదేశాలతో నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ ప్రజా సమస్యల మీద సమావేశం, మీడియా సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
టిడిపి నాయకులు ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించామని, గత 5 నెలలుగా అన్ని డివిజన్ లలో డివిజన్ పార్టీ మరియు డివిజన్ ఎన్నికల విభాగం క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలసి వైసిపి ప్రభుత్వం ఏర్పాటు నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రాంత సమస్యలు సేకరించటం జరిగిందని అన్ని సమస్యలను రాష్ట్ర పార్టీ దృష్టికి , ఎంపి కేశినేని శ్రీనివాస్(నాని) దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని, ప్రభుత్వ పరమైన అంశాల క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నామని ఎమ్ ఎస్ బేగ్ తెలిపారు, హజ్ కమిటీ నిర్మాణం, స్టేడియం నిర్మాణం, కొండ ప్రాంత ప్రజల ఇళ్ళ పట్టాల సమస్యలు , నియోజకవర్గంలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని, స్థానిక శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఎమ్ ఎస్ బేగ్ డిమాండ్ చేశారు
రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికల విభాగం కన్వీనర్ పెందుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలోని 92115 కుటుంబాలను ప్రత్యక్షంగా కలసి వారి సమస్యల్ని, నియోజకవర్గంలో ప్రజలు ఆకాంక్షిస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను, దీర్ఘ కాలిక సమస్యలను సేకరించి నివేదిక ఇవ్వాలని ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఇచ్చిన ఆదేశాలతో నియోజకవర్గంలో ది 04.12.2022 నుండి 15.05.2023 వరకు దాదాపు 165 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో డివిజన్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల విభాగం ప్రతి ఇంటికి ప్రజల వద్దకు వెళ్లి నియోజక వర్గం పరిధిలోని 47.78% అనగా 44115 కుటుంబాలను ప్రత్యక్షంగా కలసి 34142 కుటుంబాల వద్దవారి సమస్యలు, వైసిపి ప్రభుత్వం పని తీరు మీద అభిప్రాయ సేకరణ, నివాస ప్రాంతాల సమస్యలు సేకరించి డిజిటల్ విధానంలో రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వడం జరిగిందనీ , ప్రజల వద్ద సేకరించిన ఫార్మ్స్ ను పార్టీ కార్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేయటం జరిగిందనీ, రేపు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచి అనంతరం రాజమహేంద్రవరంలో జరగనున్న మహానాడులో ప్రదర్శనలో ఉంచటం జరుగుతుందని , సేకరించిన సమస్యలు అన్నింటి మీద ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ద్వారా పరిష్కారం కొరకు కృషి చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అబద్ధపు ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల హామీలు వైఫల్యాల మీద పోరాటానికి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి పోరాటానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని మరో సారి ప్రజల వద్దకు వెళ్తామని పెందుర్తి శ్రీనివాస్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి సారిపల్లి వెంకట రాధాకృష్ణ మాట్లాడుతూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా 43 ప్రధాన సమస్యలు అనేక వ్యక్తిగత సమస్యలు సేకరించటం జరిగిందని ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) గారితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వ శాఖల వైఫల్యాలు, సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమిష్టిగా వైసిపి ప్రభుత్వం మీద పోరాటానికి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని రాధా కృష్ణ ప్రకటించారు
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జిలు ధనేకుల వెంకట సుబ్బారావు, బెవర సాయి సుధాకర్, యేడుపాటి రామయ్య, నందం భవాని ప్రసాద్, సయ్యద్ కరీముల్లా, డివిజన్ పార్టీ అధ్యక్షులు పోనుగుపాటి చిన సబ్బయ్య, సురభి బాలు ప్రసాద్, బోగవల్లి నాగబాబు, కుప్పుల గంగాధర్ రెడ్డి, వడ్డాది రమణ, సందక సురేష్, జిల్లా పార్టీ నాయకులు నీలం వెంకట నారాయణ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు జిల్లా సోలంకి రాజేంద్ర కుమార్, గూడెల వెంకట రమణ, జిల్లా ఐటిడిపి అధ్యక్షుడు అద్దేపల్లి శివ, అనుబంధ విభాగాల నాయకులు సుకాసి సరిత, బబ్బూరి శ్రీనివాస్ చౌదరి, యర్రా రామారావు, నమ్మి భాను ప్రకాష్, ఆర్ మాధవ్, కోడేబోయిన స్రవంతి, ఎస్ ఉమా మహేశ్వరరావు, బత్సవత్సలం , డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శిలు భీమర శెట్టి ఈశ్వర్, కండవల్లి సాంబశివరావు, కాళ్ళ ఈశ్వర్, గోలి శ్రీనివాసరావు, సయ్యద్ ఇమ్రాన్, పెద్దిన శ్యామ్ సుందర్, యూనిట్ ఇంఛార్జిలు మన్నే నారాయణ, సురేష్, ఇర్పాని హనుమంతరావు, కుప్పిలి నాగబాబు, బెవర రవి కుమార్,గంటా రాజు, కపిలవాయి హరినాథ్, మీసాల రూకేష్ మహిళా నాయకులు లక్కు శాంతి, మెండి జ్యోతి, రాధికా విక్రమ్, బొబ్బిలి లలితా దేవి, జ్యోతి, అపర్ణ, కొసన లక్ష్మి, ఎమ్ అప్పన్న, నరసింహ, అజీజ్, బోగవల్లి సాయి, గౌరీ సూరిబాబు, వీర్ల వాసు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News