Breaking News

స్పందన ద్వారా 8 ఆర్జీలు స్వీక‌రణ, అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి

-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, అధికారుల‌తో క‌లిసి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జిలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొని వచ్చిన అర్జీలు అన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందుల పట్ల అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా , సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గతవారం వచ్చిన సమస్యల పరిష్కారం పై మేయర్ అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమము లో 8 సమస్యలు ప్రజల నుండి వచ్చాయన్నారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ కాలువల సమస్యలు ప్రజలు మా దృష్టికి తెచ్చారని అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 4, రెవిన్యూ – 2, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి)- 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *