Breaking News

నగరపాలక సంస్థకు 11 మంది విద్యార్థుల ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అనుసంధానంతో నిర్వహిస్తున్న టులిప్ (The Urban Learning Internship Program) ప్రకటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థకు 11 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా సోమవారం ఉదయం కమీషనర్ ఆదేశాల ప్రకారం, విద్యార్థులను నగరంలో జరుగుతున్న ఘన మరియు జల వ్యర్ధాల యొక్క నిర్వాహణ ప్రక్రియ మీద అవగాహన కొరకు వర్మి కంపోస్ట్ ప్లాంట్, బయో మిథనేషన్ ప్లాంట్, పూల వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ , ఎస్టిపి ప్లాంట్ మరియు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మ్యానేజ్మెంట్ ప్లాంట్లకు తీసుకువెళ్ళడం జరిగినది. అంతే కాకుండా ప్లాంట్ల యొక్క ప్రక్రియను, ప్లాంట్ యొక్క నిర్వహణ అధికారులు విద్యార్థులకు వివరంగా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ ఒబేశ్వరరావు గారు మరియు స్వచ్చ సుర్వేక్షణ్ టీం ఆశ, రవి తేజ, రత్నాకర్ మరియు రజనీష్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించటం జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *