Breaking News

జూన్ 2 న జాబ్ మేళా

-జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 15 బహుళ జాతీయ కంపిణీలు.
-సుమారు 1500 ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు.
-జిల్లా కలెక్టర్

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 2 న (శుక్రవారం) నిర్వహించే జాబ్ మేళా పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, ఐ ఏ ఎస్. విడుదల చేసారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 2 న (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి పుత్తూరు మండలం,నారాయణవనం రోడ్డు నందు గల ప్రభుత్వ డిగ్రీ & PG కళాశాల నందు నిర్వహించే జాబ్ మేళా పోస్టర్స్ ను డిఆర్డీఏ పిడి తులసితో కలసి విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది యువతకు ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని సంబందితా అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా నందు పదవ తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్, ఐ టి ఐ,బి ఫార్మ, యం ఫార్మ, డిగ్రీ,యం బి ఏ,యం సి ఏ, బి కామ్,యం కామ్, బిఎస్ సి, బి ఈ,బి టెక్,యం టెక్,యం ఎస్ సి కంప్యూటర్ సైన్స్ నుంచి పీజి వరకు ఉత్తీర్ణత అయిన యువతి యువకులకు మెగా జాబ్ మేళా పాల్గొనవచ్చునని. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 15 బహుళ జాతీయ కంపెనీలలో దాదాపు 1500 ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడునని తెలిపారు. ఈ జాబ్ మేళాలో అర్హత సాధించిన యువతీ యువకులకు నెల (Month) కు కనీస జీతం 10,000/- నుంచి 40,000/- వివిధ రకాల కంపెనీలలో ఉద్యోగ నియామకాలు కల్పించబడును.

రిజిస్ట్రేషన్ లింకు: https://www.apssdc.in/

మరిన్ని వివరాల కోసం 6300954441, 8374421195, 8121984014 నెంబర్లను సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి యన్. గుణశేఖర్
తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, యన్. గుణశేఖర్,సరితా రెడ్డి,హర్ష తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *