Breaking News

నాలుగేళ్లలో జగన్ చేసింది 9% ప్రభుత్వం ప్రచారం 99%… : పెందుర్తి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాలుగేళ్లలో జనరంజక పాలన చేశానని 99% శాతం హామీలు పూర్తి చేశామని వందల కోట్ల ప్రకటనలకు ఖర్చు పెట్టే వైసిపి ప్రభుత్వం 999 అబద్ధాలు చెప్పిందని 99 హామీల అమలులో వైసిపి వైఫల్యం చెందిందని ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి విద్వేషం, విద్వసం, విషాద పాలనకు నేటికీ 4 ఏళ్లని జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని “భవిష్యత్ కు భరోసా” నింపుతున్న తెలుగుదేశం వైపే అన్ని వర్గాల అన్ని రంగాల ప్రజల మద్దతని అందుకు ఇటీవల కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు , కుంభమేళాను తలపించిన రాజమహేంద్రవరం మహానాడులే నిదర్శనమని అగ్నిగుడంలా ఉన్నా, ఉరుములు కుండపోత వర్షం పడినా నారా చంద్రబాబు నాయుడు ” భవిష్యత్ కు భరోసా” ప్రకటన కోసం ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావడం శుభ సూచకమని రైతు, యువత, మహిళ, త్రాగు నీరు, పేదరిక నిర్మూలనల మీద టిడిపి ప్రకటన చేసిన మొదటి దశ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల్లోకి వేగంగా వెళ్లి హర్షం వ్యక్తం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ అన్నారు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చెయ్యటం విన్నాం కానీ అధికారం కోసం1000 అబద్ధాలు చెప్పటం తెలుగు ప్రజలు మొదటి సారిగా చూస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచురించాలంటే ఓ పేజీ సరిపోదని ఒక సంచిక కావాలని
పెందుర్తి ఎద్దేవా చేశారు. ఈ మేరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ వైఫల్యం చెందిన హామీలలో 99 హామీలను పెందుర్తి శ్రీనివాస్ పత్రికా ప్రకటన విడుదల చేశారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *