Breaking News

రైతుల కీలకమైన డిమాండ్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంట్ సభ్యుని కార్యాలయం కేశినేని భవన్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు  ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాల నాయకుల ప్రతినిధి బృందం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ని కలిసి రైతుల సమస్యలు తీర్చడం కోసం డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసే విధంగా, మద్దతు ధరల గ్వారెంటీ చట్టం కోసం కేంద్రం పై ఒత్తిడి తేవడానికి కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు C2+50% ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవడానికి కృషి చేయాలని . రైతాంగం కీలకమైన సమస్యల పరిష్కారానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరుగుతున్న మరో రైతాంగం ఉద్యమానికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. రైతాంగం కోరుతున్న సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు లోపల వాణిని వినిపించాలని. రైతాంగం జరిపే ఈ ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలని కేశినేని నాని కి విజ్ఞప్తి చేశారు.
రైతుసంఘం సినీయర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ కేరళ తరహాలో రైతురుణ ఉపసమన చట్టం తెచ్చి ఆత్మహత్యల నుండి రైతాంగానికి రక్షించడానికి కృషి చేయాలని అన్నారు. రైతు సంఘాల వినతి పత్రాన్ని స్వీకరిస్తూ తనకు రైతుల సమస్యలు తెలుసని, రైతుల తరుపున తన వాణిని వినిపిస్తానని, రైతుల కీలకమైన డిమాండ్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినఎంపి  కేశినేని నాని.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రథాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, అఖిల భారత కిసాన్ మహాసభ కార్యదర్శి హరనాథ్, జమలయ్య, వెంకట రెడ్డి, యన్.టి.ఆర్ జిల్లా రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.వి ఆంజనేయులు, రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు అమ్మినేని జ్వాలా ప్రసాద్, కోగంటి కోటయ్య, కాకాని శ్రీనివాస రావు, తదితరులు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *