విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల సంఘం కంబాల దుర్గారావు వారి మిత్రబృందం సారథ్యంలో కృష్ణ ప్రజాశక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కృష్ణ 80 వ జన్మదిన వేడుకలు స్థానిక పశ్చిమ నియోజకవర్గం లోని కేఎల్ రావు నగర్ నందు చిట్టి పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న MS బేగ్ భారీ కేక్ కటింగ్ అన్న సంతర్పణ మరియు పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు అనంతరం కమిటీ సభ్యులతో పాటు MS బేగ్ విలేకరుల తో మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి మరియు సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియపరిచారు అనంతరం మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరియర్లో 350 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలో పోషించి లక్షలాదిమంది అభిమానాన్ని పొంది అందరి చే సూపర్ స్టార్ గా పిలవబడటం ఒక కృష్ణ కి సాధ్యమని అన్నారు అంతేకాకుండా ఆయన ప్రజాసేవ కూడా చేశారని ఎంపీగా పోటీ చేసి ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు అదే స్ఫూర్తితో వారి కుమారుడు మహేష్ బాబు కూడా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు ఆయనే కాకుండా ఆయన అభిమానులతో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిపించడం చాలా అభినందించ దగ్గ విషయం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ పశ్చిమ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి భాను ప్రకాష్ యాదవ్, కంబాల దుర్గారావు,47 డివిజన్ అధ్యక్షులు కూరాకుల మలేశ్వరావు. పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర రామారావు, కత్తి డేవిడ్ కృష్ణ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News