Breaking News

విద్యాభివృద్ధికి వినూత్న ఆలోచనలు సృష్టించండి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య దశ నుంచే పిల్లల్లో విద్యాభివృద్ధి పెంపొందించడానికి, పాఠశాల అభివృద్ధి కోసం వినూత్న ఆలోచనలు సృష్టించాలని, తద్వారా వచ్చిన ఫలితాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  అన్నారు. దీని కోసం క్షేత్రస్థాయిలో ప్రణాళిక వేసుకుని, నిధులు సద్వినియోగపరచుకోవాలన్నారు. బుధవారం విజయవాడలోని వార్షిక పని ప్రణాళిక మరియు బడ్జెట్ (వర్క్ షాప్ ఆన్ యాన్యూల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్) అంశంపై మూడు రోజుల కార్యశాలకు ముఖ్య అతిథిగా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు  హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ఫౌండేషనల్ స్కూళ్లు అభివృద్ధి చెందేలా, విద్యార్థుల్లో అభ్యసనాంతరాలను గుర్తించి విద్యార్థులకు, ఉపాధ్యాయలుకు శిక్షణ ఇవ్వాలని, తల్లిదండ్రులతో మాట్లాడాలని అన్నారు. పాఠశాల స్థాయి ప్రణాళికలో తల్లిదండ్రుల కమిటీని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.

ఈ కార్యశాలలో సమగ్రశిక్షా జాయింట్ డైరెక్టర్ (స్టేట్ ప్లానింగ్ కో ఆర్డినేటర్)  సీహెచ్.వాసుదేవరావు గారు, స్టేట్ అకడమిక్ మోనటరింగ్ అధికారి బి.విజయ్ భాస్కర్, సత్త్వా- కైవల్య సంస్థ ప్రతినిధులు ఆకాంక్ష, రవితేజ, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ సిబ్బంది, డైట్ ప్రిన్సిపాళ్లు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులు, జీసీడీవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయలు, కేజీబీవీ ఎస్ఓలు, ప్లానింగ్ కో ఆర్డినేటర్లు, ఏఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ హేబిటేషన్, క్లస్టర్, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యశాల ద్వారా నేర్చుకున్న విషయాలను జిల్లా, మండలస్థాయిలో కూడా అవగాహన పరచాలని, అవసరమైన శిక్షణా కరదీపికలను రూపొందించాలని ఎస్పీడీ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *