Breaking News

జిల్లాలో అర్హులైన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ లబ్ది..

-ఈ ఏడాది మొదటి విడత కింద 1,27,954 మంది రైతులకు రూ.95 కోట్ల 96 లక్షల 55 వేల ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మొదటి విడత కింద 1,27,954 మంది రైతులకు రూ.95 కోట్ల 96 లక్షల 55 వేల ఆర్థిక సహాయం అందింస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలు జిల్లా పత్తి కొండలో వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఇన్‌పుట్‌ సబ్బిడీ రైతుల ఖాతాలలో జమ చేసిన కార్యక్రమాన్ని నగరంలోని రైతు శిక్షణ కేంద్రం నుండి ప్రత్యేక ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి విక్షించిన అనంతరం జిల్లాకు చెందిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్బిడీ చెక్‌ను అందజేశారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 13,500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది మొదటి విడత కింద 1,27,954 మంది రైతులకు రూ.95 కోట్ల 96 లక్షల 55 వేల ఆర్థిక సహాయం అందింస్తున్నట్లు వీటిలో సొంత వ్యవసాయ భూమి కలిగిన 1లక్ష 27వేల 739 మంది రైతు కుటుంబాలకు రూ. 95 కోట్ల 80 లక్షల 43 వేలు, అటవీ భూములను సాగు చేసుకుంటున్న 215 మంది రైలు కుటుంబాలకు రూ. 1 కోటి 61లక్షల 25 వేలు లబ్ది చేకూరనున్నదన్నారు. గత నాలుగు విడతలుగా అర్హులైన రైతులకు రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయలు పియం కిసాన్‌ పథకం ద్వారా 6000 రూపాయలను క్రమం తప్పకుండా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది అందించే మొదటి విడతతో కలిపి ఇప్పటివరకు ఐదు విడతలుగా 1,34,338 మంది రైతు కుటుంబాలకు 748 కోట్ల 43 లక్షల 19 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సహాయం అందించడంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామలలో రైతులకు సేవలందించడం జరుగుతుందన్నారు. ఈ క్రాప్‌ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్‌, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతుకు ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాని ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని అందిస్తున్నామన్నారు. గత మార్చి, ఏప్రిల్‌, మే నెలలో కురిసిన ఆకాల వర్షాలకు జిల్లాలో 1070.41 హెక్టార్‌లలో దెబ్బతిన మొక్కజొన్న, జొన్న, వరి, మినుము, నువ్వులు, పెసర పంటల సంబంధించి 1581 మంది రైతులకు 130.55 లక్షల రూపాయలు పెట్టుబడి రాయితీ కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నడు లేని విధంగా పంటలను కోసివుంచి ఆకాల వర్షం వలన తడిసి పాడైన పంట కోత ప్రయోగాల ఆధారంగా క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున అందించి రైతులను ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందన్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను సమకూరుస్తున్నట్లు శాసనభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
తొలుత రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు.
కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు టి. శ్రీకాంత్‌, బి.శివరామకృష్ణ, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌ నాగమణెమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె. బాలాజీ కుమార్‌, ఏపియంఐపి డిడి షేక్‌ సుబాని, జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు యం. రత్నశ్రీ, యం. సప్న, యు. ఊర్మిళ, ఏవివి అనిత బాను, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *