Breaking News

లబ్దిదారులకు మంజూరైన స్థలంలోనే ఇళ్ళ పట్టాలు..

-పట్టాలను అందుకునేందుకు నిడమర్రుకు బయలు దేరిన లబ్దిదారులు..
-లబ్దిదారుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో ప్రారంభించిన జగనన్న ఇళ్లు పథకంలో వినూత్నమైన ముందడుగు పడిరదని రాజధానిలో పేదలకు సైతం ముఖ్యమంత్రి భాగస్వామ్యం కల్పిస్తూ ఇళ్ళ స్థలాల మంజూరు చేయడం బృహత్తర సంకల్పమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సీఆర్‌డీఏ పరిధిలోని రాజధాని ప్రాంతం ఆర్‌ 5 జోన్‌ నందు నిడమర్రులో పేదలకు మంజూరైనా ఇళ్ళ స్థలాల పట్టాలను అందుకునేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గురువారం 2,400 లబ్ధిదారులు 60 బస్సులలో నిడమర్రుకు పయనమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, నగర పాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ లు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సంకల్పం మేరకు లబ్ధిదారులు కేటాయించిన స్థలంలోనే పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నడు లేని విధంగా లబ్ధిదారులకు వారు ఇల్లు నిర్మించుకోబోయే స్థలంలో పట్టాలు అందజేయలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి కేటాయించిన ప్రాంతానికి తీసుకువేలుతున్నామన్నారు. నగరానికి చెందిన 27,031 మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయగా ఇప్పటికే సెంట్రల్‌ తూర్పు నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు పట్టాలను క్షేత్రస్థాయిలోనే పంపిణీ చేయడం జరిగిందన్నారు. పశ్చిమ నియోజకవరానికి సంబంధించి 3,254 మంది పేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయడం జరిగిందని వారికి క్షేత్రస్థాయిలో పట్టాలు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల వెంట రెవెన్యూ, నగరపాలక సంస్థ, గృహ నిర్మాణ శాఖ అధికారులు వెన్నంటే ఉండి ఇంటి నిర్మాణం చేపట్టడానికి అవసరమైన సూచనలు, సలహాలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు అవసరమైన విధి విధానాలను తెలియజేస్తారన్నారు.
స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఏఒక్కొ పేదవాడు సొంత ఇల్లు లేదుఅనేది ఉండకూడదని ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హామిలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజధాని ప్రాంతంలో పేదలకు సొంత ఇంటి కల నేరవేర్చి ధనిక వర్గాలతో సమాన స్థానం కల్పించారన్నారు. జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజున లబ్ధిదారులు గృహా నిర్మాణాలను ప్రారంభించేలని కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.
నగర పాలక సంస్థ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తమను కూడా భాగస్వామిగా చేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పేదలకు కేటాయించిన ప్లాట్ల వద్దే జియో ట్యాగింగ్‌ చేసి పట్టాలను అందింస్తారని గృహా నిర్మాణాలు పూర్తి అయ్యేవరకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *