Breaking News

9, 10, 14 డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో ఫన్ టైం క్లబ్ లో 9, 10, 14 డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు వాలంటీర్లు అని అన్నారు.గత పది రోజులుగా తూర్పు నియోజకవర్గంలో వాలంటీర్ల వందనం కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో జన్మభూమి కమిటీ ల పేరుతో అర్హత ఉన్న సరే కళ్ళారిగెల త్రిప్పుకొని కేవలం ఆ పార్టీ వారికి మాత్రమే లంచాలు తీసుకొని పధకాలు ఇచ్చేవారని విమర్శించారు. కానీ నేడు వలంటీర్ల ద్వారా కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని పధకాలు -అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగనన్న పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లు. దేశంలో ఎక్కడకు వెళ్లి చూసినా.. మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలకు వాలంటీర్ల ద్వారా మేలు జరుగుతోంది. ఇలాంటి సారథులు, వారధులు దేశంలో ఎక్కడా లేరు అని అన్నారు. రాష్ట్రంలో 90శాతం గడపలకు వెళ్లి.. జగనన్న పాలనలో ఇలా మీ ఇంటికి వచ్చి ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్నా ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా అని ప్రశ్నించారు.. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా.. ఇలా అందించడాన్ని గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా అని అన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వాలంటీర్ కి వందనం కార్యక్రమం ద్వారా సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా వాలంటీర్ నియమించి పాలనను గడప వద్దకి తీసుకువెళ్లి ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కృష్ణ, 9వ డివిజన్ ఇంచార్జ్ వల్లూరి ఈశ్వర ప్రసాద్, 10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, శెటికం దుర్గా ప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు కాళీ, ఉమ, అచ్చుతరవు, సిద్దయ్య పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *