Breaking News

కిడ్నీ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారానికి అవసరమైన సహాకారం అందిస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్నీ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారానికి అవసరమైన సహాకారం అందిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఏ.కొండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలోని ప్రధాన మంత్రి నేషనల్‌ డయాలసిస్‌ ప్రోగ్రాంలో భాగంగా డయాలసిస్‌ కేంద్రాన్ని మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  భారతి ప్రవీణ్‌ పవార్‌ సందర్శించి, డయాలసిస్‌ నిర్వహణ తీరు, అందుతున్న సేవలు పరిశీలించారు.
అనంతరం దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో భాధపడుతు డయాలసిస్‌ లో వున్న రోగులతో వారికి వైద్య సదుపాయాలు, ప్రభుత్వ ద్వారా అందుతున్న పెన్షన్‌ స్కీమ్‌ తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏ.కొండూరు మండలంలోని తండాలలో ప్రస్తుతం అమలు చేస్తున్న తాత్కాలిక నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం దిశగా జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం ద్వారా నీటి సరఫరాకై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న రోగులు ప్రభుత్వం అందించే ఉచిత వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.యం.హెచ్‌ ఓ.,డా.యం.సుహసిని, రాష్ట్ర వ్యాధినిరోధక టీకాలునోడల్‌ అధికారి డా. దేవి, ఎన్‌సిడి` సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మాధవి, జిల్లా మలేరియా అధికారి డా. మోతీబాబు, పి.హెచ్‌.సి వైద్యధికారులు డా.దివిజ, డా స్వాతి, స్థానిక నాయకులు, ఏ.ఏన్‌.ఏమ్‌లు, యం.ఏల్‌.హెచ్‌.పి లు , ఆశాకార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *