Breaking News

గ్రామీణ మహిళలు, గర్భిణీలు కేంద్ర పథకాలను వినియోగించుకోండి..

-కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జి.కోండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్న పధకాలను వినియోగించుకొని మహిళా సాధికారత సాధించాలని, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యెజన ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు ప్రోత్సాహకం అమలుతీరు, మహిళా శిశు సంక్షేమం ద్వారా పోషణ అభియాన్‌ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు అందుతున్న పోషకాహార పంపిణీ, లబ్దిదారులు వివరాలు అదేవిధంగా ఎస్‌ఏయం, యంఏయం, పిల్లలకు పోషకాహారం పంపిణీ తదితర విషయాలు చర్చించారు. కోవిడ్‌ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, ఉచిత వాక్సినేషన్‌ కార్యక్రమంలో కూడా ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఆ విపత్తును ఎదుర్కోవడంలో మన డాక్టర్‌లు, నర్సులు, ఆశాకార్యకర్తలు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాతృత్వవందన యెజన లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో డి.యం.హెచ్‌ వో,డా.యం.సుహసిని,డిప్యూటీ డియంహెచ్‌ఓ డా నళీని దేవి, పి.హెచ్‌.సి వైద్యాధికారులు డా. కళ్యాణి, డా.రామ్‌ నరేష్‌, ఐ.సి.డి.ఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *