Breaking News

యోగాతో ఆహ్లాదం.. ఆరోగ్యం..


– ప్రతి ఒక్కరూ యోగా సాధన అలవర్చుకోవాలి
– యోగా, జుంబాలతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు
– ఫెర్టికేర్ ఆపరేషన్స్ ఏజీఎం అనూష ముదుండి, క్లినికల్ హెడ్ డాక్టర్ ప్రత్యూష
– వరల్డ్ యోగా డే సందర్భంగా డబ్ల్యూడీసీ-ఐడీఎ కోస్టల్ ఏపీ బ్రాంచ్ సౌజన్యంతో ఫెర్టికేర్ లో యోగా-జుంబా ఈవెంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానసిక ఆహ్లాదంతో పాటు, శారీరక ఆరోగ్యానికి యోగా తోడ్పడుతుందని ఫెర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్ ఆపరేషన్స్ ఏజీఎం అనూష ముదుండి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఫెర్టికేర్ నందు యోగా-జుంబా ఈవెంట్ నిర్వహించారు. ఉమెన్స్ డెంటల్ కౌన్సిల్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కోస్టల్ ఏపీ బ్రాంచ్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగా, జుంబా వంటి వాటిని సాధన చేయాలన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించి జీవితంలో విజయం సాధించేందుకు యోగా, జుంబా చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. ఫెర్టికేర్ క్లినికల్ హెడ్ డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ, యోగా, జుంబా సాధన చేయడం ద్వారా గర్భిణీలకు సుఖ ప్రసవం జరుగుతుందని తెలిపారు. యోగా, జుంబాలను దైనందిన జీవనంలో భాగంగా మార్చుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన, ఆరోగ్యదాయకమైన జీవనం గడపవచ్చని డాక్టర్ ప్రత్యూష సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీఎ కోస్టల్ ఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ టి. గోవర్ధన్, సెక్రటరీ డాక్టర్ రామ్ సునీల్, డబ్ల్యూడీసీ కోస్టల్ ఏపీ ప్రతినిధి డాక్టర్ సీమ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *