యోగ శక్తి చికిత్స శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం యోగశక్తి చికిత్స శిబిరాన్ని స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కిషోర్ బాబు ప్రారంభించారు.యోగ విధానాలు అందరికీ అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఉపయోగపడతాయని యోగ సాధన అందరికీ మంచిదని అన్నారు.క్యాంపు నిర్వహకుడు యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ రెండు చెవికొనల మధ్యన,తల మధ్యలో సహస్ర చక్రం చైతన్యవంతమై శారీరక మరియు మానసిక సమస్యలు తగ్గటమే కాకుండా 72 వేల నాడులు చైతన్యం చెంది ప్రాణ శక్తి పెంపొందించి ఆయుషు పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ ధెరపిస్టులు మాచూరి శ్రీరామ మూర్తి, అనగాని నాగమణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *