స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన అల్లూరి సీతారామరాజు అమరత్వం అజరామరం !!

-కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన ఆయన అమరత్వం అజరామరమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కొనియాడారు.

కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం కలెక్టర్ లోని స్పందన సమావేశ మందిరంలో అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో తదితరులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోన్నతమైన శక్తి. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు. మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామారాజు అన్నారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు అని తెలిపారు. రెండు సంవత్సరాల పాటు బ్రిటిషన్లకు కంటినిండా నిద్రలేకుండా గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులుయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లేయులకు ఎదురు నిలబడి పోరాడి, తెల్ల దొరల తలలు తిరిగేలా చేసిన వీరుల్లో తెలుగు గడ్డ మీద పుట్టిన బిడ్డ అల్లూరి సీతారామరాజు ఒకరన్నారు అడవినైనా తగలబెట్టేందుకు నిప్పు రవ్వ చాలన్నట్లుగా ఒక్కడే సైన్యాన్ని నిర్మించుకుని ఉద్యమ బాట సాగించారని, ఆంగ్లేయుల అరాచకాలకు ఎదురొడ్డి గిరిజన బిడ్డలకు అండగా నిలిచారని చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి అమరుడయ్యారన్నారు. నిర్లక్ష్యాన్ని గురైన జాతుల అభ్యున్నతి కోసం మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని త్యాగాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అందరికీ మేలు జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *