తిరుపతి, వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మగ్గానికి మహర్దశ తీసుకొచ్చి, దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాష్ట్ర ప్రభుత్వం నేతన్నను ఆదుకొనేందుకు ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం కింద సాయాన్ని అందిస్తోన్నది. మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ తోడుగా నిలుస్తూ భరోసా కల్పిస్తోంది. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా.. వరుసగా ఐదో ఏడాది.. “వైఎస్సార్ నేతన్న నేస్తం” నేతన్నకు ఆపన్న హస్తం అందించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను నేడు (21-07-2023)న శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరి నందలి బహిరంగ సభలో పాల్గొని జమ చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన చేనేత మగ్గం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్ పట్నం రమేష్ నేతన్న కుటుంబంతో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేసిన మగ్గం ముఖ్యమంత్రి మగ్గం నేశారు. తరువాత నేతన్నలతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాలర్పించారు.
జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి స్వాగత ఉపన్యాసంలో మాట్లాడుతూ నేతన్న నేస్తం 5 వ విడత శ్రీకార కార్యక్రమానికి వెంకటగిరి కి రావడం సతోషంగా వుందని అన్నారు. నేతన్న నేస్తం పథకంతో ప్రతి ఏటా రూ.24 వేలు అర్హత గల కుటుంబాలకు అందుతుండటంతో చేనేత రంగం పుంజుకున్నదని అన్నారు. వెంకటగిరి నేతన్నలు దాదాపు 10 మంది రాష్ట్రపతి అవార్డులు అందుకున్న వారు వున్నారని అన్నారు.
తిరుపతి జిల్లాలో చేనేత మరియు జౌలి శాఖ జిల్లాలో సుమారు 4250 మంది మగ్గము కలిగిన చేనేత కార్మికులు ఉన్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా 15475 మంది జీవనం సాగిస్తున్నారని అన్నారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి కాటన్, సిల్క్ మరియు జరీ చీరలు , శ్రీకాళహస్తి చేనేత మరియు కలంకారి ఉత్పత్తులు , నారాయణవనం చీరలు, చెన్నూర్ కాటన్ చీరలు రాష్ట్రంలోనే కాక దేశ విదేశాలలో కూడా ప్రఖ్యాతి చెందింది అన్నారు. చేనేత పరిశ్రమ నందు శిక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానం కొరకు పదవ తరగతి పాసయిన చేనేతపై ఆసక్తి కల్గిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో వెంకటగిరి పట్టణము లో ఇండియన్ ఇన్నిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టిక్నాలజీ కళాశాలలో మూడు సంవత్సరముల డిప్లమా కోర్సు లతో నైపుణ్యం కలిగిస్తున్నాయి అని తెలిపారు. చేనేత వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24000/- ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి నేడు 5 వ విడత జమ చేయబడుతున్నది అని, సుమారు రూ. 41.3 కోట్లు నేతన్నలకు ఆర్థికసాయం అందడంతో చేనేత రంగం పుంజుకుంది అన్నారు.
వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జి మరియు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీరు నిజం – మీమాట నిజం మీనాన్న వైఎస్ఆర్ ప్రజాసేవ చూసాం, ఇపుడు కనిపించే దైవంగా మీ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసి ప్రస్తుతం కనిపించే దైవంగా అందరికీ కనిపిస్తున్నారని అన్నారు. ఆళ్తూరు పాడు ప్రాజెక్టుకు అనుమతులు , పోలేరమ్మ జాతర ను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని తదితరాలు కోరారు.
నేతన్న నేస్తం బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం.గురుమూర్తి. డిఐజి అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, పర్వతనేని చంద్ర శేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు,సూళ్లూరు పేట,సత్యవేడు,గూడూరు,శ్రీకాళహస్తి,ఆత్మకూరు, సంజీవయ్య, అదిమూలం, వర ప్రసాద్, బియ్యపు మధుసూదన్ రెడ్డి,మేకపాటి విక్రమ్ రెడ్డి,చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, నెల్లూరు, జడ్పీ చెర్ పర్సన్ అరుణమ్మ, మున్సిపల్ చైర్మన్ ధరణి , ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News