Breaking News

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 8వ డివిజన్, 44వ సచివాలయం పరిధిలోని మెట్రోపాలిటన్ హోటల్ నుండి మొదలై రామచంద్ర నగర9,అశోక్ నగర్, కంచుకోట వారి స్ట్రీట్ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందితున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతుంటే ఈ ప్రభుత్వం వచ్చాక లంచాలు లేకుండా పారదర్శకంగా పధకాలు నేరుగా మా ఇంటి వద్దకే వస్తున్నాయి అని, ముసలి వాళ్ళం పెన్షన్ కోసం గంటల తరబడి లైన్ లో నిల్చునే పనిలేకుండా 1వ తేదీ రాగానే మా గుమ్మం వద్దకే వచ్చి ఇస్తున్నారు అని వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ డివిజన్ లో ఓడిపోయిన సరే మాకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కూడా ఆపకుండా చేస్తున్నారు అని, మాకు ఏ సమస్య ఉన్న యలమంచిలి జయ నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు అని కాలనీ పెద్దలు ముందుకు వచ్చి వారి మద్దతు తెలియజేయడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తకు ఆమె భర్త చనిపోతే వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆమెకు 5లక్షల రూపాయల భీమా వచ్చింది అని అది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో ఇలా ప్రక్క పార్టీలు వారు ఎవరైనా చనిపోతే ఎంతమంది కి భీమా వర్తింపజేశారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కేవలం వారి పార్టీ వారికి అది కూడా లంచాలు తీసుకొని సంక్షేమ పథకాలు అనిదించేవారని వేరే పార్టీలు అయితే అసలు వారివైపు కూడా చూసేవారు కాదని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలందరూ చూస్తున్నారు అని రాబోయే ఎన్నికల్లో వారి సహకారంతో మరొకసారి రాష్ట్రంలో, తూర్పు లో వైసీపీ జెండా ఎగురడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డా. మెహబూబ్, తుమ్మల రాంబాబు, శివ, పల్లవై ప్రసాద్, చావ రఘు, వడ్డే బాలాజీ,పాల్లవై రవి,జై హింద్ రావు, శ్యామ్, రావి, తుమ్మల మల్లికార్జున రావు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైయన్ఆర్ చారిటీస్ ద్వారా ఇస్త్రీ పెట్టె వితరణ
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన అర్జున్ జీవనోపాధి నిమిత్తం తగు సహాయం చేయాలని డివిజన్ వైసీపీ ఇన్ ఛార్జ్, వైయన్ఆర్ చారిటీస్ అధినేత యలమంచిలి జయప్రకాష్ ని సంప్రదించగా సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా ఇస్త్రీ పెట్టె ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాకు సోదర సమానమైన జయప్రకాష్  నగరంలో ఎవరికి ఏ అవసరమొచ్చిన వారి చారిటీస్ ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *