Breaking News

వైదిక ధర్మప్రచారమే విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం లక్ష్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సనాతన వైదిక ధర్మ ప్రచారమే విశ్వబ్రాహ్మణధర్మ పీఠం లక్ష్యమని వీరబ్రహ్మేంద్రస్వామి పౌత్రి జగన్మాత ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీశ్రీవీరశివకుమారస్వామి పేర్కొన్నారు. విరాడ్విశ్వకర్మ , వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల సాహిత్య ప్రచారం లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ ఆదివారం విజయవాడ విద్యాధరపురంలోని శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపం నందు జరుగింది. ధర్మపీఠం కన్వీనర్ అప్పల భక్తుల శివ కేశవరావు (శివశ్రీ)అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో నూతన కార్యవర్గం చే జగన్మాత ఈశ్వరీ మహాదేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర శివ కుమారస్వామి వారు ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైదికధర్మం సర్వమానవాళిఆచరించదగినదన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఈధర్మవ్యాప్తికి ధర్మపీఠంకృషిచేయాలని సూచించారు ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు జవ్వాది కూర్మచార్యులు విశ్వకర్మపతాక ఆవిష్కరణ చేశారు. ధర్మపీఠం సభాపతిగా విశ్రాంత అద్వైత వేదాంత ఆచార్యులు ఆచార్య చండ్రపాటి నాగవర ప్రసాదరావు, ప్రధాన సంచాలకులుగా అప్పల భక్తుల శివకేశవరావు శివశ్రీ, ఉపసభాపతిగా తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు, కోశాధిపతిగా పెంటా శివప్రసాద్, ఉపసభాపతులు గా తుమ్మోజు రామలక్ష్మాచార్యులు, తణుకు జయచంద్ర ప్రసాద్ సంచాలకులుగా డా. ఓలేటి ఉమా సరస్వతి చోడా విజయ భాస్కర్ వల్లభాపురపుస్వ రాజ్యలక్ష్మి పొన్నాడఈశ్వరచార్యులు చింతలూరు సత్యనారాయణ అల్లూరి హరిబాబు పాలకవర్గ సభ్యులుగా చిట్టూరి మురళి, అమర్ మధు ,పి ఎన్ వి ఎస్ ప్రసాద్, , కోడూరి రామకృష్ణ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు .
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి ఇంటర్మీడియట్ లో ప్రభుత్వఫాఠశాల కళాశాలల్లో చదువుతూ ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన విద్యార్ధిని విద్యార్ధులకు సిల్వర్ మెడల్ ప్రశంశాపత్రము షీల్డ్ నగదు తో ప్రతిభాపురస్కారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేశిన సభలో వైదిక జ్ఞాన విజ్ఞాన అంశములపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్రనాయకులు చల్లపల్లి మోహనరావు పట్టణ నాయకులు రీసు పురుషోత్తమాచార్యులు విశ్వంలో విలీనం వ్యవస్థాపకులు పెంటా శ్రీనివాసరావు వెస్సోట్రష్టు ఫౌండర్ బంగారు తాతారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం

-స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్ ఐఐటీ నిపుణులు -అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ సంస్థకు సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *