Breaking News

జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి సర్వం సిద్ధం…

-ముస్తాబైన సభా వేదిక..
-ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ను పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం..
-ఏర్పాట్లు ను పర్యవేక్షించిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, కలెక్టర్..

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 28న జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని చిత్తూరు జిల్లా నగరి నుండి రాష్ట్ర స్థాయి కార్యక్రమం ను  రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించ నున్నారు. ఈ కార్యక్రమానికి పగడ్బందీ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. సభా వేదిక, హెలిప్యాడ్ వద్ద పటిష్టంగా గ్యాలరీల నిర్వహణ, తాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు, గ్రీన్ రూమ్ తో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద మరియుహెలిప్యాడ్ వద్ద జరుగు తున్న పనులను గౌ. మంత్రులు డిప్యూటీ సీఎం కే. నారాయణస్వామి, రాష్ట్రఅటవీ,విద్యుత్,పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా, రాజంపేట చిత్తూరుపార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటనలప్రభుత్వ సలహాదారు మరియు ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఎం ఎల్ సి లు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యo, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, సత్యవేడుశాసనసభ్యులుఆదిమూలం,డిఆర్ఓ ఎన్.రాజశేఖర్ లు పరిశీలించారు.  బహిరంగ సభ వద్ద ఎల్ఈడి స్క్రీన్, బ్యారికేడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, సభకు వచ్చే ప్రజలకు త్రాగునీటి వసతి శానిటేషన్ ఏర్పాట్లు ను పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *