Breaking News

ఎల్ ఐ సి పెన్షనర్ల పై కేంద్ర ప్రభుత్వం వివక్ష

-ఉద్యోగుల ,పెన్షనర్ల డిమాండ్ల పై సెప్టెంబర్ 12 రెండు గంటల వాకౌట్ సమ్మె
-ఎల్ ఐ సి పెన్షనర్ల డివిజన్ మహాసభ లో నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ బీమా కంపెనీల పెన్షనర్ల పై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆలిండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్(ఎఐఐపిఎ) జాతీయ ఉపాధ్యక్షులు కె. మోహనరావు అన్నారు. ఫామిలీ పెన్షన్‌ ముప్పయి శాతం ఇవ్వటానికి యాజమాన్యాలు అంగీకరించి ప్రభుత్వ ఆమోదానికి పంపి నాలుగు సంవత్సరాలు అయిందని చెప్పారు . ఇతర రంగాలలో ఆమోదించినా ఎల్ ఐ సి , జి ఐ సి లలో ఆమోదించక పోవటం వివక్ష చూపడమేనన్నారు. ఎల్ ఐ సి పెన్షనర్ల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ ల పై సెప్టెంబర్ 12వ తేదీ రెండు గంటల వాకౌట్ సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . స్థానిక గవర్నర్ పేట బాలోత్సవ్‌ భవన్ లో ఆదివారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఐ సి ఆర్ ఐ ఎ) మచిలీపట్నం డివిజన్ 23 వ మహాసభ జరిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి పెన్షనర్‌లు మహాసభ కు హాజరయ్యారు. ఇ. జగన్మోహన రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మోహన రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ ఐ సి ప్రజల నమ్మకమే పునాదిగా నానాటికి ఎదుగుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ బలహీన పరచటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నదన్నారు . ప్రభుత్వ వాటాల అమ్మకం, ఏజెన్సీ వ్యవస్థ లో మార్పులు, సంస్థాగత సంస్కరణల పేరిట చర్యలు మొదలు పెట్టిందని చెప్పారు . పట్టాదారుల క్షేమం, దేశ హితం కోరి ఈ చర్యలు వ్యతిరేకంగా ప్రభుత్వ బీమా రంగాలలో సిబ్బంది పోరాడుతున్నారన్నారు. ఇది సహించ లేని ప్రభుత్వం చాలా న్యాయమైన డిమాండ్లను సైతం పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న దన్నారు. ఐ ఎం ఎఫ్‌ నిర్డేశిత పెన్షన్‌ సంస్కరణలు అన్ని రంగాలలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూడటం తో ఆయా రంగాల పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల పెన్షనర్ల ఐక్య పోరాటానికి కృషి జరుగుతున్నదని తెలిపారు. ఉద్యోగ సంఘం నాయకులు జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు . భీమా ప్రిమియం పై జి ఎస్ టి రద్దు చెయ్యాలన్నారు. ప్రభుత్వ బీమా రంగ పరిరక్షణ కు, పాలసీదారుల ప్రయోజనాల కు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు . ఈ మహా సభలో పెన్షనర్ల నాయకులు కె.ఎస్. మూర్తి, బి హెచ్ వి ఎల్ రాధాకృష్ణ మూర్తి, జె సుధాకర్ పాల్గొన్నారు. రానున్న కాలానికి యూనియన్‌ అధ్యక్షుని గా పి .కృష్ణ, ప్రధాన కార్యదర్శి గా బి హెచ్ వి ఎల్ రాధాకృష్గ మూర్తి, కోశాదికారిగా పి. నాగయ్య ఎన్నికయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *