Breaking News

యావత్ ప్రపంచానికి వెలుగులు నింపిన మహోన్నత గ్రంథం దివ్య ఖురాన్ షరీఫ్

-ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు జనాబ్ ఎండి రుహుల్లా
-అజిత్ సింగ్ నగర్ మసీజీద్ ఎ ముస్తఫా లో భక్తి శ్రద్ధలతో జల్స ఎ ఖత్మె ఖురాన్ వేడుకలు
-హాఫీజ్ వ ఖారి మౌలానా ముఫ్తీ సయ్యద్ అబ్దులా నిజామి ప్రత్యేక దువా 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యావత్ ప్రపంచానికి వెలుగులు నింపిన మహోన్నత గ్రంథం దివ్య ఖురాన్ షరీఫ్ అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు జనాబ్ ఎండి రుహుల్లా అన్నారు. అజిత్ సింగ్ నగర్ మసీజీద్ ఎ ముస్తఫా లో జల్స ఎ ఖత్మె ఖురాన్ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా నిర్వహించారు. మసీజీద్ కమిటీ సభ్యులు, ముస్లిం మైనార్టీ పెద్దలతో కలిసి ఎమ్మెల్సీ రుహుల్లా భాయి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు ఎండీ, హఫీజుల్లా  మాట్లాడుతూ 558 రోజుల పాటు ఫజర్ నమాజ్ అనంతరం ఖురాన్ షరీఫ్ బోధనలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్వ మానవాళి సంక్షేమం కోరుతూ ముఫ్తీ సయ్యద్ అబ్దులా దువా చేశారు. ముఫ్తీ సయ్యద్ అబ్దులా ను హాజీ మహమ్మద్ సలీమ్ ఇస్లాం సాంప్రదాయ ప్రకారం సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *