Breaking News

వాసవ్య ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కుమ్మరి కుంట్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి శ్రీమతి జి.రశ్మి మాట్లాడుతూ నాబార్డ్ వారి సహకారంతో ఎ.కొండూరు గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో కార్యక్రమాలను గత 12 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా ఈ రోజు వైద్య శిబిరాన్ని మధుమేహం, అవగాహనను, నిర్వహించుతున్నామని ఇక్కడ థైరాయిడ్, కంటి పరీక్షలు, రక్తపోటు, హెచ్.ఐ.వి పరీక్షలు నిర్వహించామని వారికి మందులను ఉచితంగా అందజేశామని ఆమె అన్నారు. ఈ వైద్యశిబిరానికి ప్రముఖ వైధ్యులు డాక్టర్ జి.సమరం ప్రజలకు చికిత్సను అందించగా వారి డాక్టర్ల బృందం కూడా ఈ శిబిరంలో పాల్గొన్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి 215 మంది సంప్రదించి మందులను పొందారని ఆమె అన్నారు.

అనంతరం డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ ఇప్పుడు వైరల్ జ్వరాలు ఎక్కువ అయ్యాయని కావున ప్రతిఒక్కరూ అప్రమత్తంతో ఉండాలని దోమలు ఇంటి పరిసరాలలో నివాసం లేకుండా ఉండేలా చూసుకోవాలని, వేడి చేసి చల్లార్చిన మంచినీటిని తాగాలని, రోజు రొండు సార్లు స్నానం చేయాలని, శుబ్రమైన పొడిదుస్తులను మాత్రమే ధరించాలని, వారానికి కనీసం మూడుసార్లు అయినా ఆకుకూరలను తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.స్వర్ణలత, డాక్టర్ సుసీల, డాక్టర్ శ్రీ నవ్య, వాసవ్య నాబార్డ్ ప్రాజెక్ట్ మేనేజరు కె.శ్రీనివాసరావు, ఆప్టమెట్రిస్ట్ ఫిరోజ్ బాషా, వాసవ్య మొబైల్ ఐ.సి.టి.సి (కృష్ణా జిల్లా), వాసవ్య నర్సింగ్, వాసవ్య ఇతర ప్రాజెక్ట్ ల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *