-జిల్లాలో 35,041 విద్యార్థులకు సంబంధించి 31,947 మంది తల్లుల ఖాతాల్లో రూ. 28,83,79,851 జమ.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన అమలుచేస్తోందని పేదరికం నుంచి బయటపడి కుటుంబ తలరాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంటుందని చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ యస్. డిల్లీరావు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగిరిలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీస్ రీయంబర్సుమెంట్ ను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రజా ప్రతినిధులతో కలిసి వీక్షించిన అనంతరం జిల్లాకు చెందిన విద్యార్థులకు ఫీస్ రీయంబర్సుమెంట్ చెక్ ను అందజేశారు. అనంతరం జిల్లా, కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు జగనన్న అమ్మఒడి, విద్య దీవెన , వసతి దీవెన, విదేశీ విద్య దీవెన, జగనన్న గోరుముద్ద , విద్య కానుక, వైఎస్సార్ సంపూర్ణ పోషణ నాడు నేడు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు . ఎంతో మంది విద్యార్థులు చదువుపై ఆసక్తి కలిగి ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్ధిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పరిస్థితులను తెలుసుకున్న ముఖ్యమంత్రి పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందించాలన్న లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీస్ రీయంబర్సుమెంట్ ను క్రమం తప్పకుండ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. ఐటిఐ, పోలీ టెక్నిక్.. ఇంజీనిరింగ్, మెడికల్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీ యజమాన్యంలకు చెల్లించవలసిన ఫీస్ మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందన్నారు. ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ఫీజు రీయంబర్సుమెంట్ తో పాటు భోజన వసతి సౌకర్యాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. దాదాపు 40 నైపుణ్యాలలో మైక్రో సాఫ్ట్ సంస్థ ద్వారా విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని శిక్షణ పూర్తీ చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వం సర్టిఫికెట్ లను అందజేస్తుందన్నారన్నారు. ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. జిల్లాలో 35,041 విద్యార్థులకు సంబంధించి 31,947 మంది తల్లుల ఖాతాల్లో 28,83,79,851 రూపాయలు తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు .రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులను చదువుకోగలుగుతున్నారన్నారు. ప్రాధమిక విద్య నుండి విద్యార్థులకు విద్యలో పటిష్టమైన పునాదిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు బై జ్యూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులను ఉచితంగా పంపిణీ చేయాలని అందజేస్తున్నారన్నారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్పు చేసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడం జరిగిందన్నారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్ర గామిగా నిలపడం జరిగిందన్నారు. .పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ గత ప్రభుత్వాలు విద్య రంగాన్ని శిథిలావస్థకు చేర్చాయన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులను చదవలేక నిరుపేదలగానే మిగిలిపోయారన్నారు. ముఖ్యమంత్రి వై, ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిషత్తుపై ముందుగానే ఆలోచనలు చేసి తల్లి గర్భం లోని శిశివు నుండి చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ, స్వేచ్ఛ పథకం ద్వారా శానిటరీ నాప్కిన్స్ పంపిణి డిజిటల్ విద్య బోధన జగనన్న విదేశీ విద్య దీవెన వంటి పథకాలను అమలు చేసి ఉన్నత శిఖరాలను చేరేందుకు కృషి చేస్తున్నారన్నారు.నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని నిర్విర్యం చేసిందన్నారు. అరకొర ఫీజులు, నాసిరకం ఆహారం, నామమాత్రపు పౌష్టికాహారంతో విద్యార్థుల పట్ల చిన్నచూపు చూడటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి నాడు-నేడు పధకం ద్వారా కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దారన్నారు. విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో ఉన్నత వర్గాల పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సహంతో విద్యార్థులు విద్యలో రాణించాలని కోరారు.కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజ రెడ్డి, బెల్లం దుర్గ, కార్పొరేషన్ చైర్మన్ లు అడపా శేషు, యం. శివరామ కృష్ణ, తోలేటి కాంత్, మనోజ్ కొఠారి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్ మొహిద్దీన్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.వి. విజయభారతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రుక్మాంగదయ్యా, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News