Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి

-ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి-జడ్పీ చైర్ పర్సన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, రైతు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, మరింత విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు వివిధ అంశాలపై ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని జడ్పిటిసిలు, వివిధ శాఖల అధికారులతో చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జరిగిన గ్రామీణాభివృద్ధి అంశంపై 2వ స్థాయి సంఘ సమావేశంలో గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి పరిశ్రమలు నీటి యాజమాన్యం అంశాలపై చైర్పర్సన్ సమీక్షించారు

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద కృష్ణాజిల్లాలో 89,824 గృహాలు మంజూరు కాగా, అందులో 19,142 గృహాలు పూర్తయినట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 83, 485 గృహాలు మంజూరు కాగా, 14275 గృహాలు పూర్తయినట్లు, ఏలూరు జిల్లా పరిధిలోని కైకలూరు, నూజివీడు నియోజక వర్గాల్లో మొదటి విడత 25,993 గృహాలు మంజూరు కాగా 6031 గృహాలు పూర్తయినట్లు, మిగతావి వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంతో కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించినట్లు అధికారులు నివేదికలు సమర్పించారు.

జగనన్న లేఔట్లలో మెరక పనులు, మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం గావించి, లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకునేలా చూడాలన్నారు. గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులకు కేడీసీసీ బ్యాంకు ద్వారా 2 లక్షల వరకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలుపగా, గృహాలు నిర్మించుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని, ఈ విషయం లో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చైర్పర్సన్ గృహ నిర్మాణ అధికారులకు సూచించారు.

కేసరపల్లి జగనన్న లేఔట్ లో ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదని, కారణం అప్రోచ్ రహదారి సరిగా లేకపోవడం అన్నారు. కాల్వ గట్టు ప్రక్కన రహదారి నిర్మించుటకు 3 కోట్లు మంజూరు అయినట్లు అధికారులు తెలుపగా, త్వరగా పనులు ప్రారంభించాలని చైర్పర్సన్ సూచించారు.

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, మహిళా సంఘాలకు రుణ సౌకర్యం, 0 వడ్డీ పథకాలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని, మహిళల ఆర్థిక అభివృద్ధికి జిల్లాలో అవనిగడ్డలో మహిళ మార్ట్ ఇప్పటికే ఏర్పాటు కాగా పెడనలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని, వీటిని జిల్లాలో మరిన్ని ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ సూచించారు.

వైయస్సార్ భీమా అమలు సమీక్షిస్తూ , పేద కుటుంబాలలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి వైయస్సార్ భీమా అమలు చేస్తున్నదన్నారు. ఈ పథకం ఎలా పొందాలో వాలంటీర్లు వారి పరిధిలో విస్తృత అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల పథకాల అమలులో జడ్పిటిసిలను సర్పంచ్లను స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.

జాబ్ మేళాలు ఎక్కువగా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం పథకం ప్రయోజనాలు పట్ల సమగ్ర అవగాహన కల్పించి, నిరుద్యోగ యువత పథకం సద్వినియోగం చేసుకునేలా చూడాలని పరిశ్రమల అధికారులకు సూచించారు. కేవలం పేపర్ ప్రకటనతో సరిపెట్టకుండా గ్రామ సచివాలయ, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు

ముద్ర రుణాలు ఎక్కువమంది పొందేలా చూడాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్, డ్రైన్లు క్లీనింగ్, దోమల నివారణ చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న చెత్త నుండి సంపద కేంద్రాలు రన్నింగ్లోకి తేవాలని అన్నారు. అనంతరం వ్యవసాయం అంశంపై నిర్వహించిన 3వ స్థాయి సంఘ సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ విత్తనం నుండి విక్రయం వరకు రైతులకు సకల సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్బికేలు ఏర్పాటు చేశారని అన్నారు. వీటి ద్వారా రైతులకు సమగ్ర సేవలు అందించాలన్నారు. సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందలేదని రైతులు ప్రజాప్రతినిదుల నుండి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు సంబంధించి గత ఏడాది రైతుల సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఆర్బికేలలో 50% గోన సంచులు ముందస్తుగా అందుబాటులో ఉంచుటకు చర్యలు తీసుకుంటున్నామని, ఆర్బికేల వద్ద మిల్లుల వద్ద తేమ శాతంలో తేడాలు వస్తే రైతుల నష్టపోకుండా ఈ ఏడాది మొబైల్ టెక్నికల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎక్కడైనా తేమ శాతం లో తేడాలు వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే మొబైల్ టీములు తేమ శాతం నిర్ధారిస్తారని తెలిపారు.

అనంతరం విద్య వైద్యంపై 4వ స్థాయి సంఘం, స్త్రీసంక్షేమంపై 5వ స్థాయి సంఘం, సాంఘిక సంక్షేమంపై 6వ సాయి సంఘం, ప్లానింగ్ మరియు ఆర్థికం అంశంపై 1వ స్థాయి సంఘం, పనులు అంశంపై 7వ స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జడ్పీ సీఈవో జ్యోతి బసు, ఆయా స్థాయి సంఘాల్లో జడ్పిటిసి సభ్యులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *