Breaking News

ఈవీఎం, వివిప్యాట్స్‌ యంత్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు అధికారులను ఆదేశించారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎం, వివిప్యాట్స్‌ యంత్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు అధికారులను ఆదేశించారు.గొల్లపూడి మార్కెట్‌ యార్డులో ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీఎం, వివిప్యాట్స్‌ గోడౌన్‌ ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి జిల్లాకు 15వేలు వివిప్యాట్స్‌, కంట్రోల్‌ యూనిట్లు (సియు.యంత్రాలు) జిల్లాకు రానున్నాయన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎం, వివి పాట్స్‌ యంత్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. జిల్లాకు రానున్న యంత్రాలను పటిష్టమైన భద్రతతో గోదాములో ఉంచాలన్నారు. ప్రతి యంత్రం కోడ్‌ నెంబరును ఆన్‌లైన్‌ లో పరిశీలించి కట్టుదట్టమైన భద్రతతో గోదాములో భద్రపరచాలన్నారు. ముఖ్యంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో వాటిని గోదాముల్లో ఉంచాలని కలెక్టర్‌ ఢల్లీి రావు అధికారులకు పలు సూచనలు చేశారు.ఇవీఎం గోడౌన్‌ పరిశీలనలో డిఆర్‌ఓ కే. మోహన్‌ కుమార్‌, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ ఎం. దివాకర్‌ బాబు, ఎలక్షన్‌ సెల్‌ సూపరిండెంట్‌ సిహెచ్‌. దుర్గాప్రసాద్‌, మార్కెట్‌ యార్డ్‌ ఇఇ వై. శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ఇఇ వి ఎస్‌ ఆర్‌ కే ప్రసాద్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *