విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ కృష్ణా జన్మాష్టమి ఆరవ వార్షికోత్సవం విజయవాడ మారుతి నగర్ వేరన్న వీధి లో శ్రీ వేణుగోపాల్ స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అధ్యక్షులు పడాల వాసు, కోశాధికారి పడాల లక్ష్మణరావు, జాయింట్ సెక్రెటరీ ఆవాలు, ఉగాది జనరల్ సెక్రటరీ ఏనుల సీతారాం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా కోరాడ గాలి మీడియాతో మాట్లాడుతూ మా యాదవ కులస్తులము మరియు ఇతర కులస్తులు కలిసి ఐక్యమత్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని ఈ కార్యక్రమంలో సుమారు 4000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆరు సంవత్సరాల నుండి మాకు మేమే కమిటీ వాళ్ళము స్వయంగా చందాలు వేసుకొని శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నాము కావునా దాతలు ఎవరైనా ముందుకొచ్చి విరాళాలు సమర్పిస్తే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News