విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గురువారం స్థానిక రామవరప్పాడు లో యామనేని రామస్వామి వీధిలో 21 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 21 సంవత్సరాలు నుంచి చేస్తున్నామని, రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు . కార్యక్రమములో ముఖ్య అతిథులను పెద్దలను ,నాయకులను, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, వైయస్సార్ నాయకులు అవినాష్, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ, తెలుగుదేశం నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, లాకా వెంగళరావు యాదవ్ తదితర నాయకులు విచ్చేసి స్వామిని, దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లారని ఆయన చెప్పారు. శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగునని ఈరోజు సాయంత్రం ఉట్టు కొట్టు ఉత్సవ కార్యక్రమం జరుగుతుందని అని తెలిపారు.
తదనంతరం అఖిలభారత యాదవ కులం సంఘం స్టేట్ జనరల్ సెక్రెటరీ పెద్దిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 21వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, నిర్వాహకులను అభినందిస్తున్నానని అన్నారు. ఆ శ్రీకృష్ణుడు ప్రజలకు భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని , నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఉపాధ్యక్షులు చింతమట్ల రాంబాబు, తుపాకుల శివ లీల, ఎం వెంకటేష్, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News