విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 36వ వార్షికోత్సవ స్థానిక రామవరప్పాడులో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూగత 36 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ,ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం పదివేల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు సాయంత్రం పుట్టుకొట్టే ఉత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు బాల శౌరి, సెంట్రల్ నియోజవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ, పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తదితర నాయకులు, యాదవ సంఘం నాయకులు, స్థానిక పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News