Breaking News

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి 11వ వార్షికోత్సవ వేడుకలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకృష్ణ జన్మాష్టమి 11వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ స్థానిక సీతారాంపురం లో 25 వ డివిజన్ కార్పొరేటర్ బంకా భాస్కర్ రావు ఆధ్వర్యంలోఅంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ బంకా భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు గత పది సంవత్సరాల గడిచి 11వ వార్షికోత్సవంలో అడుగుపెట్టిందని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రజలను సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, ప్రజలందరూ ఉండాలని నేను కోరుకుంటున్నానన్నారు. ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, విచ్చేసారని అన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం తో పాటు సాయంత్రం ఉట్టు కొట్టు కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా బండ్ల మీద దేవుడు విగ్రహాలతో మ్యాజిక్ లైట్లు తో, అలంకరించబడిన బండ్లు ను పురవీధులలో ఊరేగింపు చూపురలను ఆకట్టుకున్నాయి. ఉత్సవ సంబరాలు ఘనంగా జరిపామని స్థానిక పెద్దలు నాయకులు ఈ ఉత్సవాలలో ఎంతో సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రావు, యాదవ సంఘం నాయకులు, స్థానిక టింబర్ డిపో వ్యాపారులు, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *