Breaking News

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం.

ఆన్ లైన్ లో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ సేవలు
ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ.. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులో.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవలు..

కార్డ్ ప్రైం ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు.. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమ దస్తావేజులు తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా చెల్లించే సదుపాయం… అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యం.. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి .. ఈ-సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్ కు మరింత భద్రత.. • ఎటువంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ… వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు..
• ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల నిర్మూలన..

ఈ-స్టాంపింగ్ తో వేగవంతం కానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
• స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు..
• స్టాంపులు కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ..
‘స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (SHCL) బ్రాంచ్ లు,
స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) ఈ స్టాంపింగ్ సేవలు..
* రాష్ట్రవ్యాప్తంగా 2500 సెంటర్ల ద్వారా ఈ- స్టాంపుల విక్రయం..

గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు..
• దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సైతం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు..
• తొలి విడతగా 1680 గ్రామ/వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్ గ్రేడ్..
‘త్వరలో మిగిలిన గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా సేవల’ విస్తరణ.. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు..
ముఖ్యంగా స్టాంప్ విక్రయ సేవలు, ఇ.సి (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్), సి.సి, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మరియు మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి..

అపోహలు వద్దు – దుష్ప్రచారాలను నమ్మవద్దు…
రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భద్రత.. అందుబాటులోకి రానున్న డిజిటల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్.. ఫిజికల్ డాక్యుమెంట్ తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్ కు గుర్తింపు.. ఈ-సైన్ ద్వారా మరింత భద్రత..
ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం.. ఆన్లైన్ వెరిఫికేషన్తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్.. బ్యాంకులు ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో వెరిఫై చేసుకునే సదుపాయం కలదు..
నూతన విధానంలో అత్యంత సెక్యూరిటీ ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందించబడుతుంది..
నూతన విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’.. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ ‘వాస్తవం’.. నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది పూర్తి అవాస్తవం.. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్ పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇవ్వబడుతుంది..

పారదర్శకతకు పెద్దపీట.. సత్వర సేవలకు రాచబాట
“స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల” కు సూచనలు, ఫిర్యాదుల కొరకు
జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *