Breaking News

పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా అధ్యక్షతన పెనమలూరు నియోజకవర్గం  ఉయ్యూరు మండలం  ఆకునూరు గ్రామం అక్కినేని కన్వీన్షన్ హాల్ నందు నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. కృష్ణాజిల్లా ఇంచార్జి మంత్రి  ఆర్ కె రోజా అధ్యక్షతన నిర్వహించిన పెనమలూరు  నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరై స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారధి  ద్వారా నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలు సమీక్షించారు , నియోజకవర్గం లో అభివృద్ధి పనులపై సమీక్షించి మరియు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులకు తెలియపరచి వాటికి తగు పరిష్కారాలుకై చర్చించి తగు సలహాలు సూచనలు చేసి ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని తద్వారా జగనన్నకు, జగనన్న ప్రభుత్వనికి మంచి పేరు తేవాలి అని అధికారులను ఇన్చార్జి మంత్రి  ఆర్కే రోజా  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు  కొలుసు పార్థసారథి ,  జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు IAS, ,  జిల్లా అధ్యక్షులు మచిలీపట్నం శాసనసభ్యులు  పేర్ని నానీ , పామర్రు శాసనసభ్యులు అనిల్  డీసీసీ బ్యాంకు జిల్లా ఛైర్పర్సన్ పద్మావతి  స్థానిక ఎంపీపీ లు , జడ్పిటిసి లు , ఎంపీటీసీ లు , సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *