Breaking News

తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా గద్దె:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ ను పటిష్ట పరచి ఎంత వర్షం వచ్చిన నీరు నిలవకుండా చేసామని, ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ నందు 94 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన పార్కు నిర్మాణం, గీత నగర్ నుండి భుపేష్ గుప్తా నగర్ వరకు ఫెన్సింగ్ & గ్రీనరి పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ డివిజన్ ను దత్తత తీసుకొన్న అని కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సవతి ప్రేమ చూపించి అభివృద్ధి చేయకుండా వదిలేశారని, పైగా మురుగునీరు చేరి అంటువ్యాధులు వస్తున్నాయి అని స్థానిక ప్రజలు మొరపెట్టుకొంటే వర్షం వస్తే నీరు నిలవదా అని చులకనగా మాట్లాడారు అని విమర్శించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయలు వెచ్చించి నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మొత్తం పటిష్టపరిచామని ఎంత పెద్ద వర్షం వచ్చిన సరే గంటల వ్యవధిలో నీరు మొత్తం పోయేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో గతంలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్ల కాలంలో చేశామని దమ్ముగా ధైర్యంగా చెప్పగలమని ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తున్న గద్దె రామ్మోహన్ గాని, వారి నాయకుడు చంద్రబాబు గాని దమ్ముంటే అభివృద్ధి మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2014 లో దాదాపు 600 హామీలతో బుక్ కొట్టించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసారని, ఆ పార్టీ వెబ్ సైట్ లో నుండి మనిఫెస్టో ను డిలీట్ చేసారని ఎద్దేవా చేశారు. మరలా నేడు మరో కొత్త నాటకానికి తెరదీసి బాబు ష్యురిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రజల వద్దకు వస్తున్నారని , అంత చిత్తశుద్ధి ఉంటే నాడు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మీరు బాండ్ పేపర్లు కాదు కదా మీ ఆస్తి పత్రాలు ఇచ్చిన సరే ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిఅని, ప్రజలు ఆయనను తప్ప మరెవరిని నమ్మరని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, బహుదూర్, డివిజన్ అధ్యక్షులు చెన్నంశెట్టి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వేముల దుర్గారావు, దివ్య, దుర్గ, దుర్గా భవాని మరియు డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *