గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల పరిధిలో బిఎల్ఓలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన ఆయా ఫారాలను 2 రోజుల్లో ఆన్ లైన్ చేయాలని, సూపర్వైజరి అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా బిఎల్ఓలు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఓటర్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన ఫారాలు 2 రోజుల్లో ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. ఆన్ లైన్ చేయడానికి జిఎంసి ప్రదాన కార్యాలయంలో ప్రత్యేకంగా డేటా ఎంట్రి ఆపరేటర్లను కేటాయించామని, సూపర్వైజరి అధికారులు ఫారాలు ఆన్ లైన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సూపర్వైజరి అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించి, ఎక్కడైనా కేంద్రాలు మార్పులు ఉంటె వెంటనే తెలియచేయాలన్నారు. అలాగే ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది ఎన్నికల సంఘం నుండి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఏదైనా కారణంగా సెలవులో ఉన్నప్పటికీ ఫోన్ లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుండి అందే మార్గదర్శకాలను ఎన్నికల విభాగం ఎప్పటికప్పుడు ఎన్నికల విభాగం వాట్స్ అప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలన్నారు. ఎన్నిల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అనంతరం నగరంలో పారిశుధ్య పనుల పై సమీక్షించి, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగేలా పర్యవేక్షణ చేయాలని ఎంహెచ్ఓని, చెత్త తరలింపు వాహనాలు షెడ్యుల్ మేరకు అందుబాటులో ఉండేలా చూడాలని ఈ.ఈ.ని ఆదేశించారు. ఈ నెల 15లోపు జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి వాలంటీర్ తమ పరిధిలోని ఇళ్లల్లో ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే నిర్వహించి ఏఎన్ఎం కు ఇవ్వాలని, ఏఎన్ఎం 15 తర్వాత అవసరమైన వారికి ప్రాధమిక పరీక్షలు చేసి, తదుపరి జరిగే మెడికల్ క్యాంప్ లకు తీసుకువస్తుందన్నారు. నోడల్ అధికారులు ఆయా సర్వే సమగ్రంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, సూపర్వైజరి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News