Breaking News

ప్రతి నెల 3 వ సోమవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి నెల 3 వ సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని, నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ సర్వీస్ కి సంబందించిన సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందించవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగులకు సంబందించిన సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3 వ సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు.
అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి జగనన్నకు చెబుదాం, స్పందనకు అందే ఫిర్యాదులను భాధ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలని, విభాగాల వారిగా జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంకై ప్రత్యేక సిబ్బందిని కేటాయించుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. స్పందన ఆర్జీల అప్ డేట్స్ ని ప్రత్యేకంగా విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన గ్రూప్ లో పోస్ట్ చేసి, పరిష్కారాల పై సమీక్షా చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 22 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 7, ఇంజినీరింగ్ విభాగం 7, రెవెన్యూ విభాగం 2, ప్రజారోగ్య విభాగం 4, ఉపా సెల్ విభాగం సంబంధించి 1, అకౌంట్స్ విభాగం కి సంబంధించి 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, బయాలజిస్ట్ మధుసూదన్, మేనేజర్ శివన్నారాయణ, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, ఏసిపిలు, ఈఈలు, యస్.యస్ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *