Breaking News

స్పందన అర్జీలను ప్రాధాన్యతగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జాయింట్ కలెక్టర్ డి.కె. బాలాజీ తో కలిసి స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ఎస్ డి సి లు శ్రీనివాసులు, భాస్కర్ నాయుడు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖకు -50, పోలీసు శాఖ -3, పంచాయతీరాజ్ శాఖ- 3, సర్వే శాఖ – 3 , రిజిస్ట్రేషన్ శాఖ – 1, మునిసిపల్ కార్పొరేషన్ – 2, ఏ పి ఐ ఐ సి – 1, ఆర్ అండ్ బి – 1, ఇరిగేషన్ శాఖ – 1, పి డి డి ఆర్ డి ఎ – 2 కలిపి మొత్తం 67 వినతులు రావడం జరిగిందని, సదరు అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *