Breaking News

రెండవ దశ నాడు నేడు పనులను వేగవంతం చేయండి : జిల్లా జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండవ దశ నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ డి.కె బాలాజీ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డి.ఈ, ఏ.ఈ, ఈ.ఈ లతో నాడు-నేడు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండవ దశ నాడు – నేడు పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు వేగవంతం చేయాలన్నారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ వచ్చిన తరువాత నాడు- నేడు పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఇంకనూ జిల్లాలో పేరెంట్స్ కమిటీ అకౌంట్స్ లో అందుబాటులో ఉన్నా 13 కోట్ల రూపాయలను అవసరమైన పాఠశాలలకు ట్రాన్స్ఫర్ చేసుకొని 10 కంపోనెంట్స్ పనులను ఎం.ఈ. ఓ లతో సమన్వయం చేసుకొని పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రతి మండలంలో వారానికి రెండు పాఠశాలలలో అన్ని కాంపోనెంట్స్ పనులను పూర్తి చేసి ఫొటోస్ అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ శేఖర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, నాడు – నేడు ప్లానింగ్ కోఆర్డినేటర్ రామచంద్రా రెడ్డి, డి ఈ, ఎ ఈ, ఈ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *