కడప, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లొనే సంక్షేమ పథకాల క్యాలండర్ ద్వారా ప్రతి గడపకు సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దీవించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ అన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా..48/2 వ డివిజన్ రామరాజుపల్లి, సచివాలయం-2 లోని పొన్నం రెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద పలు వీధులు, ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక 48/2 వ డివిజన్ రామరాజుపల్లి, సచివాలయం-2 లోని పొన్నం రెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద పలు వీధులు ప్రాంతాలను సందర్శించారు సోమవారం స్థానిక 48/2 డివిజన్ కార్పొరేటర్ ఇంఛార్జి మరియు టిటిడి బోర్డు మెంబెర్ మసీమ బాబు ఆధ్వర్యంలో సచివాలయం-2 పరిధిలోని ఎంరామరాజుపల్లి, సచివాలయం-2 లోని పొన్నం రెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద పలు వీధులు, ప్రాంతాలలో *గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తొలుత పొన్నం రెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ప్రారంభించారు. అలాగే 48/2 డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ ఇంచార్జి మరియు టిటిడి బోర్డు మెంబెర్ మసీమ బాబు, కాలనీవాసులు *గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా కు ఘనంగా స్వాగతం పలికారు. 116 వ రోజైన గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కి అభిమానులు,నగర ప్రజానీకం, మహిళలు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి… రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు… స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి.. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వార్డు లోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ది చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు లబ్ది చేకూరిందని ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
1) వంకర సుజాత అనే మహిళ తనకు జగనన్న విద్యా దీవెన, వైఎస్ ఆర్ ఆసరా, వైఎస్ ఆర్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఓడి, వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ ఆర్ పింఛన్ కానుక, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.10 లక్షల, 82 వేల 818 లు లబ్ధి చేకూరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం లో మాకు అందలేదని ఇలాంటి ముఖ్యమంత్రి కి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
2) చింతకుంట రాధా అనే మహిళ తనకు వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వైఎస్ ఆర్ ఆసరా, జగనన్న వసతి దీవెన, వైఎస్ ఆర్ పంటల బీమా, వైఎస్ ఆర్ రైతు భరోసా, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 10 లక్షల 05 వేల 543 లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
3) గంప సురేఖ అనే మహిళ తనకు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ, జగనన్న వైఎస్ ఆర్ ఆసరా, వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 10 లక్షల 03 వేల 967 లు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
4) సుంకేసుల హుస్సేన్ బీ అనే తనకు వైఎస్ ఆర్ ఆసరా, జగనన్న అమ్మ ఓడి, వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.09 లక్షల 66 వేల 416 లు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
5) కోమటిపల్లి వెంకట సుబ్బమ్మ అనే మహిళ తనకు జగనన్న అమ్మ ఓడి, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.9 లక్షల 5 వేలు లబ్ది చేకూరందని ఈ ప్రభుత్వానికి బాసటగా ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తోపాటు కార్పొరేటర్ ఇంఛార్జి మరియు టిటిడి బోర్డు మెంబెర్ మసీమ బాబు, మార్కెట్ యార్డు ఛైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, కార్పొరేటర్ శ్రీరంజన్ రెడ్డి, వైకాపా నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, ఎన్ఆర్ఐ తోట కృష్ణ, పస్తం అంజి, పెద్దిరెడ్డి రామ్ మోహన్ రెడ్డి, పవర్ అల్తాఫ్, మనోజ్ కుమార్, నాయకుర్రాళ్లు టి.వి సుబ్బమ్మ, మరియలు, సుశీల, నారాయణమ్మ, నగర కార్పొరేటర్లు సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News