Breaking News

అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలను అందజేయాలి.. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అటవీ హక్కుల చట్ట నిబంధనలను పరిశీలించి గిరిజనుల పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఢల్లీి రావు అధికారులను ఆదేశించారు.స్థానిక జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నందు మగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అటవీ హక్కుల చట్ట 2006 (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలం అన్నరావుపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజనులు 11.40 ఎకరములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరడటం జరిగిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అటవీ భూములనుసాగుచేసుకుంటున్నామని ఆ భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని అప్పిల్‌ చేసుకోవడం జరిగిందన్నారు. అయితే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్ట ప్రకారం నిబంధనలు పరిశీలించి అర్హత మేరకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. రెండు రోజులలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, పట్టాలు మంజూరు చేసేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అటవీ అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి అప్పన్న, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *