Breaking News

నగరంలో “దసరా కార్నివాల్ ఎగ్జిబిషన్ కం సేల్” ప్రారంభం 


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్థానిక శేష సాయి కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 11, 12 ,13 తేదీలలో “దసరా కార్నివాల్ ఎగ్జిబిషన్ అండ్ సేల్” జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైసిపి నాయకులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కళ్యాణ్, దీప్తి మాట్లాడుతూ మా ఎగ్జిబిషన్లో ఇండియన్ వేర్, వెస్ట్రన్ వేర్, హ్యాండీక్రాఫ్ట్, హౌస్ డెకర్స్, జ్యువెలరీ, ఎక్జరీస్ మొదలగు స్టాల్స్ కాకుండా నార్త్, సౌత్ నుండి స్టాల్స్ ని ఏర్పాటు చేసామని, ఆంధ్ర ప్రదేశ్ లో చీరాల, మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, కేక్స్ తయారీ వంటివి కూడా ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు కళ్యాణ్, దీప్తి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నార్త్ సౌత్ వేర్ కాకుండా అన్ని రకముల డిజైన్లతో జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు వీక్షించి కొనుగోలు చేయాలని వారు కోరారు. ఈ స్టాల్స్ లో సెంటిని హాస్పిటల్ విజయవాడ స్టాల్ కూడా ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాల్స్ యజమానులు వైష్ణవి రెడ్డి, సెంటిని హాస్పిటల్‌ కిరణ్మయి, తదితర స్టాల్స్ నిర్వాహకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం

-స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్ ఐఐటీ నిపుణులు -అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ సంస్థకు సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *